మృతుని కుటుంబానికి నాయకుల పరామర్శ : ఆర్థిక సహాయం అందజేత

మృతుని కుటుంబానికి నాయకుల పరామర్శ : ఆర్థిక సహాయం అందజేత

సిద్దిపేట జిల్లా/ గజ్వేల్ :సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన అర్కల భిక్షపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం మృతుడి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మర్కూక్ మండల మాజీ ఎంపీపీ పాండు గౌడ్, పాములపర్తి సర్పంచ్ భవాని బాలకిషన్, బీఆర్ఎస్ మార్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యకల కనకయ్య ముదిరాజ్, ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, వార్డు మెంబర్ దండు కరుణాకర్ మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఆర్థిక సహాయం అందజేశారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?