శివంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

శివంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శివంపేట పోలీస్ స్టేషన్‌ను వార్షిక/ఆకస్మిక తనిఖీలో భాగంగా సందర్శించి స్టేషన్‌లోని పరిపాలనా వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ తీరును పరిశీలించారు. కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు, రిమాండ్ ఫైళ్లు, ఇతర క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యూఐ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్‌-బెయిలబుల్ వారెంట్లు (NBW), సీసీ నంబర్లు రాని కేసుల వివరాలను ఎస్సై మధుకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి కేసుల ఫైళ్లను త్వరితగతిన కోర్టులకు సమర్పించాలని ఆదేశించారు. స్టేషన్ సిబ్బంది విధి నిర్వహణ, వర్టికల్స్ అమలు, రిసెప్షన్ నిర్వహణపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది కోర్టుల్లో మూడు కేసుల్లో జీవితకాల శిక్ష విధించేలా తీర్పులు వచ్చేలా కృషి చేసిన ఎస్సై మధుకర్ రెడ్డి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుల కోసం వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి అవసరమైన మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. మండలంలోని ప్రధాన కూడళ్లు, గ్రామాలు, అంతర్‌జిల్లా సరిహద్దు మార్గాల్లో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం గస్తీ నిర్వహించాలని, రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ఆశ్రయించేలా చైతన్యపరచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బంది యూనిఫాం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో తూప్రాన్ సీఐ వెంకటరాజు గౌడ్, ఎస్‌బీ సీఐ సందీప్ రెడ్డి, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-08 at 4.14.03 PM (1)

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?