జుక్కల్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా

జుక్కల్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా

  • రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు.. SIRకు వ్యతిరేకంగా ఆందోళన
  • NH-161పై భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

జుక్కల్,  : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించారు. జుక్కల్ చౌరస్తా సమీపంలోని NH-161పై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. కాంగ్రెస్ జెండాలు చేతబట్టి, నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. SIR  ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం లోని వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఓటర్ల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జుక్కల్ చౌరస్తా పరిసర ప్రాంతం సందడిగా మారింది. భారీగా కార్యకర్తలు రహదారిపైకి రావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Views: 44

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?