శెట్లూర్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

శెట్లూర్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఐకేపీ భవన్‌కు భూమిపూజ.. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బిచ్కుంద,  : జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని శెట్లూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు కృషితో గ్రామానికి ఐకేపీ భవన్ మంజూరు కాగా, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బాబు, చాంద్ సాబ్ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.
 ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
శెట్లూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (ప్యాడీ సెంటర్) ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ కాళోజీ విఠల్ రావు, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంస్థల కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, యువత, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News