పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా

పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా

పాపన్నపేట  : మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో పోషకాహార మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 25 ఆహార ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన వివిధ రకాల ఆహార పదార్థాలను విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. స్థానికంగా సులభంగా లభించే కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు తదితర పదార్థాలతో తయారు చేసిన పోషకాహార వంటకాలను ప్రదర్శించారు.స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ అధ్యక్షతన పోషకాహార మేళాను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, శిశు అభివృద్ధి పథకం అధికారి వెంకట రమణ, పాపన్నపేట పరిధిలోని పర్యవేక్షకులు, బాలల సంక్షేమ సమితి సభ్యులు కె. ఉప్పలయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగరాజు, పోషణ మాస కార్యక్రమం బాధ్యులు జి. శ్రీనివాస్, పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు, కళాశాల అధ్యాపకులు జి. సతీష్, జె. శ్రీనివాస్, ఎస్. సంతోష్ కుమార్, బి. ప్రవీణ్ కుమార్, సంధ్యారాణి, బి. రమేష్, కె. నవీన్ కుమార్, టి. ప్రణీత్ రెడ్డి, బి. మధుసూదన్, టి. దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ కడుపు నింపుకోవడం మాత్రమే కాకుండా, తాము తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఎంత ఉండాలి, ఏయే ఆహార పదార్థాలను ఎంత పరిమాణంలో తీసుకోవాలి, స్థానికంగా లభించే ఆహార పదార్థాల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి అనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు అందించే ఆహార పదార్థాలతో విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను అధికారులు పరిశీలించి, రుచిచూశారు. వాటిలోని పోషక విలువలను వివరించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉత్తమ వంటకాలను ఎంపిక చేసి బహుమతులు అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషకాహారం, సమతుల్య ఆహారం ప్రాధాన్యత గురించి అధికారులు విద్యార్థులకు వివరించారు. అధికంగా చిరుతిళ్లు, నూనె పదార్థాలు, ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను కూడా వివరించారు. పోషణ మాసం ముగింపు సందర్భంగా కూరగాయలతో బతుకమ్మను, బోనాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో జిల్లాలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమాలకు ముగింపు పలికారు. స్థానికంగా అందుబాటులో ఉండే పదార్థాలతో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు మరియు ప్రతి ఒక్కరికీ కార్యక్రమ బాధ్యులు జి. శ్రీనివాస్, వృక్షశాస్త్ర అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాపన్నపేట హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Views: 135

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?