బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు BSF సంపూర్ణ మద్దతు
నాగర్ కర్నూల్ : బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం BSF రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ మాట్లాడుతూ, మాన్యవర్ కాన్షిరామ్ గారి 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న శుక్రవారం నాడు బడంగ్‌పేట్‌లోని సిరిపురం యాదయ్య మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే "హలో బహుజన.. చలో బడంగ్‌పేట్" సభకు నలుమూలల నుండి బహుజన సైనికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రామ్ శేఖర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు కవులు, కళాకారులు, మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని, ప్రతి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


