రోడ్లపై మైనర్ల మృత్యు రేసింగ్.

రోడ్లపై మైనర్ల మృత్యు రేసింగ్.

- సైలెన్సర్ మోతలతో దద్దరిల్లుతున్న వీధులు.. ఏం చేస్తోంది అధికార యంత్రాంగం?

నాగర్ కర్నూల్,  : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మైనర్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రధాన రహదారులు వారికి రేసింగ్ ట్రాక్ లుగా మారాయి. సైలెన్సర్లు తీసేసి, చెవులు చిల్లులు పడేలా భారీ శబ్దాలు చేస్తూ, మితిమీరిన వేగంతో బైకులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

పట్టపగలే ప్రమాదకర విన్యాసాలు:
స్కూల్ కు వెళ్లాల్సిన 8వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులు చేతుల్లో పుస్తకాలు పట్టాల్సింది పోయి బైకుల హ్యాండిల్స్ పట్టుకుని వీరంగం సృష్టిస్తున్నారు. ఒక్కో బైక్ పై ముగ్గురు, నలుగురు ఎక్కి, హెల్మెట్ లేకుండా, వన్ వీలింగ్ లు చేస్తూ మృత్యువును సవాల్ చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఎదురుగా వచ్చే పాదచారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులు:
ఇది కేవలం బైక్ విన్యాసాలతో ఆగడం లేదు. చదువుకు డుమ్మా కొట్టి కొందరు విద్యార్థులు మద్యం, గంజాయి, సిగరెట్ల వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది విద్యార్థులకు కాళ్లు, చేతులు విరిగినా కూడా వారి తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పోలీసుల మౌనం:
పిల్లలకు ఇష్టం వచ్చినట్లు ఖరీదైన బైకులు కొనిచ్చి రోడ్లపైకి వదిలేస్తున్న తల్లిదండ్రులదే అసలు తప్పని ప్రజలు మండిపడుతున్నా రు. మరోవైపు ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల డిమాండ్:
వెంటనే స్పందించి బిజినేపల్లిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, సైలెన్సర్లు తొలగించిన బైకులను సీజ్ చేయాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రేపు జరిగే ఏ ప్రమాదానికైనా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?