దుబ్బాక జెడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సస్పెన్షన్

దుబ్బాక జెడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సస్పెన్షన్

నిజామాబాద్, :నిజామాబాద్ రూరల్ ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (గెజిటెడ్ హెచ్.ఎం) ఎ.శశికళను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడంతో పాటు, ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాల సామాగ్రిని విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, ఈ ఉదంతంపై ప్రాథమిక విచారణ జరిపించారు. ఈ సందర్భంగా పాఠశాల విధులకు హాజరుకాకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్లు, సంబంధిత అధికారుల నుండి కానీ, పాఠశాల నిర్వహణ కమిటీ నుండి (SMC) ఎలాంటి అనుమతి లేకుండానే పాఠశాలలోని జనరేటర్, ఫర్నిచర్‌ను విక్రయించినట్లు, ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను కూడా విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో హెచ్.ఎం శశికళను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?