పేదల బియ్యం వ్యాపారుల పాలు...?

పేదల బియ్యం వ్యాపారుల పాలు...?

  • మొన్న కూసుమంచి నేడు నేలకొండపల్లి...?
  • మరో మిల్లుపై నివేదిక సమర్పించారట...?
  • కోట్ల రూపాయల బియ్యం గోల్ మాల్ పై  నోరు మెదపని అధికారులు...?
  • కాసుల కక్కుర్తికి లేని ధాన్యం నమోదు...?
  • సూర్యాపేట జిల్లా అనంతగిరి మిల్లును రికార్డులలో చూపారా...?
  • తనిఖీలకు వచ్చే అధికారులకు తెలిసిన పట్టించుకోలేదా...?
  • ఓ మిల్లుకు ఎదురుగా పాత బిల్డింగులు మొక్కజొన్నలు కూడా ధాన్యమే నా...?
  • సివిల్ సప్లై రెవెన్యూ అధికారుల పాత్ర పై వెల్లువెత్తుతున్న విమర్శలు...?
  • కోట్ల రూపాయల బియ్యాన్ని దారిమల్లించిన పట్టించుకోని దుస్థితి...?

ఖమ్మం : ఖమ్మం జిల్లా లో సీఎంఆర్ రైస్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు దొడ్డదారిలో దారి మళ్లించి వ్యాపారంగా మలిచి కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు జోరుగా విమర్శలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రధానంగా పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి కూసుమంచి మండలాలలోని మిల్లర్లు దర్జాగా సీఎంఆర్ బియ్యం కోసం సేకరించిన ధాన్యాన్ని అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు బియ్యం గా మార్చి రాష్ట్ర సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు దండుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆలస్యంగా మేలుకున్న సివిల్ సప్లై రెవిన్యూ అధికారులు అర్ధరాత్రి వరకు హడావుడి చేసి ఇటీవల నేలకొండపల్లి మండలంలోని మిల్లును జల్లెడ పట్టి హడావుడి చేశారు నివేదిక జిల్లా డిఎంకు అందించినట్లు సమాచారం. కాగా ఇటీవల నేలకొండపల్లి మండలంలో వ్యాపారుల మధ్య విభేదాలు సి ఎం ఆర్ బియ్యం ఎగవేత ఆరోపణలపై ముగ్గురు ప్రధాన వ్యాపారులు మిల్లర్లు ప్రైవేటు పంచాయతీలు నిర్వహించి మండలంలోని ఒక వ్యాపారి నుండి ప్రైవేటు పంచాయతీలో సెటిల్మెంట్ చేసుకున్నట్లు మరికొన్ని వివాదాలలో మరో వ్యాపారి ఇటీవల నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సుమారు 2.20 కోట్ల రూపాయలకు బియ్యం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారికంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం. ఒక్కసారిగా గత కొంతకాలంగా వ్యాపారుల మధ్య మిల్లర్ల మధ్య వివాదం మరో కోణంలో వెలుగు చూస్తున్నట్లు సమాచారం. నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామపంచాయతీ లో ప్రధాన హైవే రోడ్డు పక్కన ఓ మిల్లు నిర్వాహకులు సుమారు 40000 క్వింటాల సీఎంఆర్ రైస్ ను లెక్కల్లో తేడా ఉన్నప్పటికీ విజిలెన్స్ సివిల్ సప్లై రెవెన్యూ అధికారులకు సమాచారం తెలవకుండా పెద్ద స్థాయిలో పైరవీలు జరిపినట్లు ఆ మేరకు ఇటీవల ప్రైవేటు సెటిల్మెంట్లు జరిగినట్లు ఆ ఒప్పందాల ప్రకారం సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా గుమస్తాలుగా మామూలు వ్యాపారులుగా ఉన్న కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి వ్యవసాయ భూములతో పాటు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల తనిఖీలకు వచ్చిన అధికారులను ప్రసన్నం చేసుకొని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం లోని గల ఓ రైస్ మిల్లులో సిఎంఆర్ ధాన్యం ఉన్నట్లు అధికారులను పక్కదారి పట్టించి చివరికి ప్రసన్నం చేసుకొని ఆడిట్ నుండి బయటపడినట్లు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి జిల్లా స్థాయి అధికారులతో పాటు కొందరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినట్లు జనాలు గుసగుసలాడుతున్నారు. కాగా కొత్తూరు సమీపంలోని ఓ మిల్లు నిర్వాహకులు మిల్లుకు ఎదురుగా ఉన్నటువంటి పాడుబడిన మిల్లులో మొక్కజొన్నలను నెట్లు వారిగా చూపించి అధికారులను ఏమార్చినట్లు సమాచారం. వ్యాపారుల మధ్య లావాదేవీలలో సుమారు 7: 40 కోట్ల రూపాయలు లెక్కల్లో మతలబు నెలకొన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ స్పందించి ప్రభుత్వ గడువులోగా బియ్యమును అందించని మిల్లర్లపై రెవెన్యూ సివిల్ సప్లై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని రికవరీ చేయాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?