ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం.
- జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు బ్లాక్ డే నిర్వహణ..
ఆదిలాబాద్ బ్యూరో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కీసర్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని అంబేడ్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ నిరసన కార్యక్రమంలో, మాజీ డిసిసి సాజిద్ ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్,జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్చార్జ్ గౌలి సంజీవ్ కుమార్ ,మాజీ మున్సిపల్ ఫ్లోర్ బండారి సతీష్ ,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. బీజేపీ “ఓట్ చోరీ”కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నాయకులు ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యం, లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా పారదర్శకతను నిర్ధారించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న “ఓట్ చోరీ” ఆరోపణలపై సమగ్రంగా సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ డిసిసి సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా “ఓటు హక్కును కాపాడుదాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం రాజ్యాంగ విలువలను కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని అయన అన్నారు . ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ది అయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభగాం అధ్యక్షురాలు అన్నపూర్ణ , ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్, మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు జీశాన్ , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీరామ్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవదాస్ చారి, అత్తర్ అలీ, మందాకిని, కాడే సంతోష్ , జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సిరాజుద్దీన్, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకలజితేందర్, మావల గ్రామ సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ , మావల మండల అధ్యక్షులు కుదురుపాక సురేష్ , బోర చేసే విభాగం అధ్యక్షులు పొట్ట అశోక్ , మావల ఎస్ఐ విభాగం అధ్యక్షులు అక్షయ్ , వార్డు ప్రెసిడెంట్లు జగదీశ్వర్ రెడ్డి, ఫాహిమ్, షౌకాత్, భూసం ప్రభాకర్, తుమ్మ ప్రకాష్ , దమ్మ కీర్తి , సలీం ,దిల్షాద్ , అజర్ , మోసిన్ , రాజశేఖర్,పట్టణ కాంగ్రెస్ కమిటీనాయకులు, మండల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


