శ్రీ గురుపీఠంలో ఘనంగా గురువారం ప్రత్యేక పూజలు
భక్తులకు అన్నప్రసాద వితరణ
శివంపేట(మెదక్): గురువారం సందర్భంగా శివంపేట మండలంలోని శ్రీ గురుపీఠంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం, గురుపరంపర దేవాలయం, పంచవటి, శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, దివ్య మంగళహారతి నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి శతనామార్చన, శ్రీ దత్త స్తోత్రావళి పారాయణం, దత్త భజనలు నిర్వహించారు. శ్రీపాద వల్లభ, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ గురు మాణిక్ ప్రభు, శ్రీ గురు స్వామి సమర్థులతో కూడిన దత్తాత్రేయ స్వామివారికి దివ్య మంగళహారతి నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సద్గురు సాయి మధ్యాహ్న హారతి అనంతరం శ్రీ సాయి సత్సంగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు చిన్న గొట్టిముక్కల వాస్తవ్యులు శ్రీ కాంతారావు గారు కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం, శ్రీ సాయిబాబా వారిని వివిధ రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అన్నప్రసాద వితరణ చేసిన కాంతారావు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గురుదేవులను ప్రార్థించారు. కార్యక్రమంలో శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పెద్దగోని శివకుమార్ గౌడ్, ఆయన సతీమణి రమాదేవి, ట్రస్ట్ సభ్యులు జిన్నారం సూర్యకుమార్ గౌడ్, న్యాయవాది జిన్నారం పెద్దగోని శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ జిన్నారం పెద్దగోని స్వరాజ్యలక్ష్మి, రాజ్యం బిక్షపతి, చిన్న గొట్టిముక్కల శ్రీ కాంతారావు, గూడూరు సర్పంచ్ బేగరి నర్సయ్య, న్యాయవాది వజ్జ సాయి కిరణ్, శెట్టిపల్లి బిక్షపతి, ఆయన కుమారులు, సీఎం రాజేందర్ రెడ్డి, నాగేంద్ర, శ్రీ గురుపీఠం సమన్వయకర్త పొంతనపల్లి సత్యనారాయణ గౌడ్, పాత్రికేయ మిత్రులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురుదేవుల ఆశీస్సులు పొందారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


