డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. జీవితానికి ‘యెస్’ చెప్పండి

డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. జీవితానికి ‘యెస్’ చెప్పండి

మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలి : బీఎల్ రఘు

బిచ్కుంద  :  బిచ్కుంద  యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని బీఎల్ రఘు పిలుపునిచ్చారు. బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బీఎల్ రఘు మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలు, సామాజిక సేవలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ‘సే నో టు డ్రగ్స్ – సే యెస్ టు లైఫ్’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, మత్తు పదార్థాలపై సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బిచ్కుంద ఎస్సై రాజు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?