క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలి.

క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలి.

క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు.

నిజామాబాద్ : క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు. నగరంలోని​ బస్వాగార్డెన్​లో అమెచ్యూర్​ తైక్వాండో అసోసియేషన్​ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఓడినవారు నిరత్సాహపడొద్దు..
జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. తైక్వాండో సాధన ద్వారా శరీరాన్ని చురుకుగా, క్రమశిక్షణతో, దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన వారితో పాటు ఎల్లో బెల్ట్ కేటగిరీలో విజయం సాధించలేకపోయిన క్రీడాకారులు కూడా నిరుత్సాహపడకుండా, ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత కష్టపడి తదుపరి అవకాశంలో విజయం సాధించాలని ఆయన ప్రోత్సహించారు. ఓటమిని అంగీకరించి వెనుకడుగు వేయకుండా, పట్టుదలతో మళ్లీ ప్రయత్నించాలని క్రీడాకారులకు సూచించారు.
100మందికి పైగా క్రీడాకారులు
ఈ పోటీలకు యూనివర్సల్ తైక్వాండో అకాడమీ, వారియర్స్ అకాడమీ, ఛాంపియన్స్ టైక్వాండో అకాడమీ, అమేజింగ్ టైక్వాండో అకాడమీ తదితర అకాడమీలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా హాజరైన క్రీడాకారులకు క్యూరోగి, పూమ్సే విభాగాలతో పాటు వివిధ వయస్సు, బరువు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ, శిక్షణకు పంపుతున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్న కోచ్ జేసీ మనోజ్ కుమార్​ను అభినందించారు. ఈ సందర్భంగా అకాడమీ కోచ్‌లు గంగాధర్, నాగరాజ్, శివకుమార్, వినయ్ తదితరులను అభినందించారు. 

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?