అండర్-18 ఖోఖో జిల్లా స్థాయి ఎంపికలు
నర్సాపూర్, : మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-18 బాలబాలికల జిల్లా స్థాయి ఖోఖో ఎంపికలను ఈ నెల 10న నర్సాపూర్‌లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. హరికిషన్, ప్రధాన కార్యదర్శి బి. శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.నర్సాపూర్‌లోని టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్‌లో ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2026 డిసెంబర్ 31 నాటికి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఎంపికలకు అర్హులని తెలిపారు. 01-01-2009 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఎంపికల్లో వయస్సు, ఎత్తు, బరువులను పరిగణనలోకి తీసుకుని ఇండెక్స్ స్కోర్‌ను నిర్ణయిస్తారని, వయస్సు, ఎత్తు (సెంటీమీటర్లలో), బరువు (కిలోలలో) కలిపి ఇండెక్స్ స్కోర్‌ను లెక్కిస్తారని తెలిపారు. బాలురు, బాలికలు రెండు విభాగాల్లోనూ ఇండెక్స్ స్కోర్ 250 పాయింట్లకు మించకూడదని స్పష్టం చేశారు. ఎంపికలకు హాజరయ్యే ప్రతి క్రీడాకారుడు తప్పనిసరిగా బోనఫైడ్ అర్హత పత్రాన్ని వెంట తీసుకురావాలని, దానిపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం ఉండాలని సూచించారు. అలాగే వయస్సు ధ్రువీకరణ పత్రంతో పాటు అవసరమైన ఇతర పత్రాలను కూడా తీసుకురావాలని కోరారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో మెదక్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
– ఎస్. హరికిషన్, అధ్యక్షుడు
– బి. శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి
మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్
ఫోన్: 9963770406
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


