దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద విద్యుత్ సమస్యలపై రైతుల ధర్నా రాస్తారోక
హత్నూర మండలం దౌల్తాబాద్ అంబేద్కర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రైతులు విద్యుత్ సమస్యలపై ఆందోళన కు దిగారు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘం రైతులు మాట్లాడుతూ ప్రస్తుత విద్యుత్ సరపరలు తరచూ అంతరాయాలు ఏర్పడడంతో పాటు ఓల్టేజ్ సమస్య కూడా తీవ్రంగా ఉంటుందని వారు ఆరోపించారు దీంతో బోరు మోటార్లు సైతం కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మోటార్లు మరమ్మతులకు గురి కావడం కొత్త మోటార్లు ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో ఆర్థిక భారం పడుతుందని మరోవైపు వరి పొట్ట దశకు చేరుకున్న వారి పంటకు సకాలంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేశామని వారు అన్నారు విద్యుత్తు సమయానికి అందకపోవడంతో పంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏంటి అని వారు అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ కొరత లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హత్నూర మండల పలు గ్రామాల భారతీయ కిసాన్ రైతులు పాల్గొన్నారు

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


