బేగంపేట్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి కలకలం 

బేగంపేట్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి కలకలం 

హైదరాబాద్: బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా అనుమానిస్తున్న ఓ యువకుడిని మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటన కలకలం రేపింది. ఫ్లైయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన యువకుడు అక్కడ ఫొటోలు దిగుతూ సంచరిస్తుండటంతో అధికారులు అనుమానించారు. అతడిని తనిఖీ చేసి వివరాలు ఆరా తీయగా, తాను ఎయిర్‌ఫోర్స్ అధికారినని చెప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణలో అతడిని నితీష్ కుమార్ పాల్గా గుర్తించినట్లు సమాచారం. నేరెడ్‌మెట్‌లో నివాసముంటున్న అతడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నితీష్ కుమార్ పాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఎయిర్‌ఫోర్స్ అధికారినంటూ ప్రొఫైల్ నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అదే పేరుతో యువతులను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో మిలిటరీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బేగంపేట్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎయిర్‌ఫోర్స్ అధికారి దుస్తులను ఎలా పొందాడు? సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రొఫైల్ నిర్వహించాడు? మరెవరినైనా మోసం చేశాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?