ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు.: ఇంచార్జి మంత్రి జూపల్లి 

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు.: ఇంచార్జి మంత్రి జూపల్లి 

  • ప్ర‌జ‌లు నేరుగా వాట్సాప్ లో ఫిర్యాదులు చేసే అవ‌కాశం
  • మంత్రి జూప‌ల్లి ఆదేశాల‌తో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
  • మంత్రి పేషీ, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల్లో ప్ర‌త్యేక వాట్సాప్ నంబ‌ర్లు
  • ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న మంత్రి జూప‌ల్లి

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 8 (విజన్ ఆంధ్ర)ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశాల‌తో ప్రభుత్వ సేవలపై ఫిర్యాదులకు ఇకపై ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా సరికొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.  వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు క‌లెక్ట‌ర్ల‌కు ఈ మేర‌కు దిశానిర్ధేశం చేశారు.  ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని 4 క‌లెక్ట‌రేట్ల‌లో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను (ప్రత్యేక గ్రీవెన్స్ సెల్)  ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం  కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా వాట్సాప్  సేవ‌ల‌ను  క‌లెక్ట‌ర్లు అందుబాటులోకి తెచ్చారు. హైద‌రాబాద్ లోని మంత్రి జూప‌ల్లి పేషిలోనూ ఈ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు.  ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు, వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

వాట్సాప్‌ నంబర్లు

మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ: 8500689596

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌: 9492341947

నిర్మల్‌ కలెక్టరేట్‌: 8317557897

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌: 7569986036

మంచిర్యాల కలెక్టరేట్‌: 9492123642   ప్రజలు ఈ వాట్సాప్‌ నంబర్లను వినియోగించుకుని తమ సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సత్వర పరిష్కారం పొందాలని మంత్రి కోరారు. ఉమ్మ‌డి జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ల‌కు మెసేజ్ రూపంలో పంపవచ్చని క‌లెక్ట‌ర్లు తెలిపారు. ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలు పంపించాలని సూచించారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?