దళితులపై దాడులను అరికట్టాలి

దళితులపై దాడులను అరికట్టాలి

  • అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి.
  • తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షుడు బత్తుల చంద్రమౌళి

హుస్నాబాద్  :నల్లగొండ జిల్లాలో దళిత మహిళలపై దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మహిళా విద్యార్థినిని అవమానించిన ఘటనపై కూడా చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షుడు బత్తుల చంద్రమౌళి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ  దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. అట్రాసిటీ కేసులపై డీజీపీ ప్రత్యేక చొరవ చూపాలని, జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అంతర్పుల వెంకటస్వామి, రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ కొమ్ముల సంపత్, సిద్దిపేట జిల్లా దళిత సంఘాల జేఏసీ కన్వీనర్‌ బోనగిరి రవి, హుస్నాబాద్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి గడిపే బాలు, దళిత సంఘాల నాయకులు కోహెడ రాజు, అందాసి రాజయ్య, కాదాస్‌ నగేష్, డప్పు రాజలింగం, గడిపే అంతయ్య, మట్టెల ఎల్లయ్య, అంతే వనకర్, ఎనగందుల బాబు, మండల నాయకుడు ఠాగూర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Views: 73

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?