పేద గౌడ కులస్తులకు అండగా మోకుదెబ్బ. జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్.

పేద గౌడ కులస్తులకు అండగా మోకుదెబ్బ.   జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్.

నిజామాబాద్  పేద గౌడ కులస్తులకు  మోకుదెబ్బ అండగా నిలుస్తుందని జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం  జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షులురాలు వేంపల్లి సరోజ గౌడ్ లు మాట్లాడుతూ నిజామాబాద్  జిల్లా గౌడ సంఘానికి అర్మూర్ మండలంలోని పల్లె గ్రామపంచాయతీకి చెందిన 15 గౌడ కుటుంబాలు జిల్లా గౌడ సంఘానికి రాజీనామా చేసి గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేరారన్నారు.ఎర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామంలో వీడిసి .39 గీత కార్మిక కుటుంబాలను, 11 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయడం అన్యాయమన్నారు.సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వారి పైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లాలోని ఆర్మూర్ మండలంలో కొంతమంది గౌడ కులస్తులు పేద గీత కార్మిక కుటుంబాలను కుల వృత్తి చేసుకోకుండా వేధింపులకు గురిచేస్తూ ఆర్థిక రాజకీయ అండదండలతో అణిచివేయడాన్ని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తీవ్రంగా ఖండిస్తూందన్నారు.పేద గౌడ గీత కార్మికులకు గౌడ కులస్తులకు అండగా మోకుదెబ్బ నిలుస్తుందని గౌడ కులస్తులందరికీ సమాన వాటాలు దక్కేవరకు పోరాడతామన్నారు.గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం మోకుదెబ్బ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బలమైన నిర్మాణాన్ని ఏర్పటుచేసి త్వరలోనే గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం  కోసం జిల్లాకు రాష్ట్ర నాయకులను రప్పించి భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ చిన్నాగౌడ్, జిల్లా కార్యదర్శి వేంపల్లి సంతోష్ గౌడ్, జిల్లా నాయకులు బొడ్డు తిరుపతి గౌడ్ ,పల్లె గౌడ కులస్తులు భైరగోని సాయగౌడ్, బూరుగు రాజు గౌడ్, ఉదగామ్ బాలరాజ్ గౌడ్, రంగారి పోషగౌడ్, బొంగోని ఆంజనేయులు గౌడ్, ఉదగామ్  సత్యనారాయణ గౌడ్, ఏనుగంటి వివేక్ గౌడ్, భైరగోని సచిన్ గౌడ్, బొంగోని నవీన్ గౌడ్, ఏనుగంటి మహేష్ గౌడ్, భైరగోని సిరాజ్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.

Views: 49

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News