టీయూడబ్ల్యూజే హెచ్ -143 మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ
ఆవిష్కరించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) ఈ నెల 27న వికారాబాద్ లో జరగనున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ పర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H-143) జిల్లా మహాసభగోడపత్రికను తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం TUWJ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమాజంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 27న వికారాబాద్లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని షిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో TUWJ జిల్లా కన్వీనర్ ఎం. రవీందర్, కో-కన్వీనర్లు జి. నర్సింలు, జావీద్, రాజు, వికారాబాద్ నియోజకవర్గ నాయకులు అమర్, వెంకట్, సర్సింహ, తాండూర్ నియోజకవర్గ నాయకులు, జర్నలిస్టులు పాల్గోన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


