సొంత నిధులతో బోరు మోటర్ వేయించి ప్రారంభించిన చేగుంట ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ
చేగుంట మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ముదిరాజ్ భవనం కమిటీ హాల్ ఆవరణలో మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు, చేగుంట ఉప సర్పంచ్, పేదల పెన్నిధి మహమ్మద్ రఫీ సొంత నిధులతో బోరు వేయించడంతో పాటు మోటర్ ను దింపించారు. మంగళవారం రోజు బోరు మోటర్ ను ప్రారంభించిన అనంతరం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ వివిధ గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులతో అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపూర్ గ్రామం ముదిరాజ్ సంఘం సభ్యులు కోరిక మేరకు వారికి బోరు మోటర్ వేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బేగంపేట జగదీశ్వర్ ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ సంఘ సభ్యులు మాజీ సర్పంచ్ నాగభూషణం, కత్తుల రాజు, మల్లేశం, రాములు గడ్డ చంద్రం, గడీల రాజు ,అక్కల మహేష్ ,మల్లేశం నీల నర్సింలు, వార్డు సభ్యులు,భిక్ష పతి వంశీ ,కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


