ఆషాఢ మాసం బుగ్గ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : ఆషాఢ మాసం సందర్భంగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ రాజ రాజేశ్వర బుగ్గ దేవాలయంలో గంగమ్మ తల్లికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గ రాజేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్ చైర్‌పర్సన్ మసాడి శ్రీదేవి–శ్రీరాములు, కొలజ్యోతి అరుణ్‌కుమార్, గుగ్గిళ్ల సునీత–రాజబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.
Views: 90
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
