విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

భద్రాచలం : రాష్ట్ర టీజీపీఈజేఏసీపిలుపు మేరకు విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా భద్రాచలం ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా భద్రాచలం ఎన్‌పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (డీఈ), టీజీపీఈజేఏసీ జిల్లా కన్వీనర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు, ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఐక్యత ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజీపీఈజేఏసీ–ఎన్‌పీడీసీఎల్ కార్యవర్గ సభ్యులు, ఏడీఈ నర్సింహారావు, ఏఏఓ లక్ష్మి, ఏఈలు రోహిణి, జ్యోతి, ఉపేందర్, వెంకటేశ్వర్లు, సబ్ ఇంజినీర్లు హరి, తరుణ్, రాకేష్, లిఖిత, మౌనిక, మహిళా ఉద్యోగులు లీలావతి, పుణ్యవతి, దీప్తి, ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకట్రాజు, రామకృష్ణ, ఉదయ్, కేటీఎన్ మూర్తి, పెద్దరాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి