ఫైర్ ఫైటింగ్ శిక్షణ ప్రారంభం

 ఫైర్ ఫైటింగ్ శిక్షణ ప్రారంభం

కొత్తగూడెం : సింగరేణి యస్&పీసీ (సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సెల్) విభాగం ఆధ్వర్యంలో 42వ బ్యాచ్‌కు చెందిన 29 మంది సెక్యూరిటీ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ అంశాలపై వారం రోజుల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. కొత్తగూడెంలోని యస్&పీసీ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఈ శిక్షణను ఏరియా సెక్యూరిటీ అధికారి, ట్రైనింగ్ అధికారి ఎం.డి. జాకీర్ హుస్సేన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యూనిఫాం సిబ్బందికి ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), అగ్నిమాపక (ఫైర్ ఫైటింగ్) అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండటం అత్యంత అవసరమన్నారు. అందుకే యస్&పీసీ విభాగంలోని ప్రతి సెక్యూరిటీ సిబ్బందికి క్రమం తప్పకుండా ఈ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ ద్వారా సిబ్బంది వృత్తి నైపుణ్యం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందన్నారు. వారం రోజులపాటు ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను బోధిస్తామని, ఇందుకోసం సింగరేణి మెయిన్ హాస్పిటల్, మైన్స్ రెస్క్యూ స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం అగ్నిమాపక శాఖ నుంచి నిపుణులను ఫ్యాకల్టీగా తీసుకొస్తున్నట్లు వివరించారు. ఫస్ట్ ఎయిడ్‌పై సరైన అవగాహన ఉంటే ప్రమాద సమయంలో గాయపడిన వారికి వైద్యుడి వద్దకు తీసుకెళ్లేలోపే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే విధి నిర్వహణ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తెచ్చి సింగరేణి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిపై ఉందన్నారు.మెరుగైన వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సంస్థతో పాటు సమాజాభివృద్ధికి ప్రతి సెక్యూరిటీ సిబ్బంది కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో జూనియర్ ఇన్‌స్పెక్టర్ కె. రాజనర్సు వందన సమర్పణ చేశారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి