శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
- ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఆవరణలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు పాల్గొని, సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ మన జీవితంలో గురువు స్థానం అత్యున్నతమైనది. అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయులు గురువులన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా చూపిన సత్యం, ధర్మం, దయ, సమానత్వం అనే మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, సబ్ కా మాలిక్ ఏక్ అని చాటిన సాయిబాబా బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సాయిబాబా దివ్య ఆశీస్సులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.
Views: 53
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
