చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్

చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్

వెల్దుర్తి  (మెదక్ జిల్లా):   వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు నిర్వహించారు. ప్రతి విద్యార్థికి 12 నోటు పుస్తకాల చొప్పున అందజేశారు. కాలేజీకి రాణి విద్యార్థులు కూడా కాలేజీకి వచ్చి నోటు పుస్తకాలు తీసుకోవాలని అన్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోవడానికి వారికి ఆటంకం కలగకూడదని ప్రభుత్వం నోటు పుస్తకాలు ఇస్తుందని  ప్రతి విద్యార్థి కాలేజీకి వచ్చి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
 
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అద్వానంగా గజ్వేల్ జాలిగామ బైపాస్ రోడ్డు అద్వానంగా గజ్వేల్ జాలిగామ బైపాస్ రోడ్డు
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామాయంపేట వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి, వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని...
ఆగస్టు 31 వరకు కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్
పుర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి 
చేనేత సహకార సంఘ అధ్యక్షురాలికి సన్మానం
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులు
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం