చౌటకూర్‌లో పాఠశాలల నిధుల వినియోగంపై ఆడిట్
మండల విద్యాధికారి (ఎంఈవో) అనూరాధ సందర్శన
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో 'సమగ్ర శిక్ష' కార్యక్రమం ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించారు. పాఠశాలలకు కేటాయించిన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించారా లేదా, వాటికి సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా అనే అంశాలను ఆడిట్ బృందం పరిశీలించింది.ఆడిట్‌లో భాగంగా పాఠశాలల నిర్వహణ వినియోగ పత్రాలు, ఖర్చుల బిల్లులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, నగదు పుస్తకాలు (క్యాష్ బుక్స్) తదితర రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిధుల లెక్కలు, ఖర్చుల ఆధారాలను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు.ఆడిట్ కేంద్రాన్ని మండల విద్యాధికారి (ఎంఈవో) అనూరాధ సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆడిట్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలల నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని, అవసరమైన బిల్లులు, పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనల మేరకే నిధులను పాఠశాలల అవసరాలకు ఉపయోగించాలని, సంబంధిత వివరాలను నివేదికల రూపంలో ఆడిట్ బృందానికి సమర్పించాలని ఎంఈవో స్పష్టం చేశారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 18:14:19
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
