పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
- జాతీయ జెండాలతో కదం తొక్కిన విద్యార్థులు
– దేశభక్తి నినాదాలతో మార్మోగిన పరకాల
హనుమకొండ /పరకాల: ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ మరియు మండల శాఖల ఆధ్వర్యంలో, పట్టణ శాఖ అధ్యక్షులు *గాజుల నిరంజన్,* మండల శాఖ అధ్యక్షులు
*కాసాగాని రాజకుమార్* నాయకత్వంలో
తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
పరకాల ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కదం తొక్కారు. జాతీయ జెండాల రెపరెపలు, విద్యార్థుల దేశభక్తి నినాదాలతో పరకాల పట్టణం మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు ,
రాష్ట్ర నాయకులు
గుజ్జ సత్యనారాయణ రావు గారు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక అని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడమే తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని, జాతీయ సమైక్యతను, ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనడం పట్ల బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరంగా ర్యాలీ ద్వారా పరకాలలో దేశభక్తి స్ఫూర్తి మరింత ఉవ్వెత్తున ఎగిసిందని, యువతలో జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని గాజుల నిరంజన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పి జయంతి లాల్, దేవునూర్ మేఘనాథ్, జిల్లా కోశాధికారి రామన్న, పరకాల కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్, నాయకులు చందుపట్ల రాజేందర్రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, పి.మల్లారెడ్డి, దంచనాదుల కిరణ్, సోషల్, పరకాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, స్పెషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్, నాయకులు మార్త బిక్షపతి,మారేడుగొండ భాస్కరాచారి, దుబాసి కృష్ణ ప్రసాద్, కానుగుల గోపీనాథ్, బాసాని సోమరాజు, ముత్యాల దేవేందర్, కోడెల లింగమూర్తి,దాసరి వెంకటేశ్వర్లు, సారంగ నరేష్, కొలనుపాక రేవంత్ సిద్దు, రంతు, లింగయ్య,D. నగేష్, R. నవీన్, K. రమేష్, K. వీరాస్వామి, N.కొమురయ్య,D. దేవేందర్ గార్లు బూత్ అధ్యక్షులు K. సురేష్, J.లింగయ్య, D.అరుణ్, J. ఓదెలు, A. సదయ్య, G. శశిధర్ రెడ్డి, T.మురళి, V. బిక్షపతి, B. శివ,వెంకటేశ్వర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
