మురికినీటి బాధలకు చెక్ పెడతాం

లక్ష్మీనగర్ లో డిప్యూటీ మేయర్ సునీల్ రావు క్షేత్రస్థాయి పర్యటన

మురికినీటి బాధలకు చెక్ పెడతాం

కరీంనగర్,: కమాన్ రోడ్ లక్ష్మీనగర్ లో వర్షపు నీరు నిలవడం మరియు డ్రైనేజీ సమస్యతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కార్పొరేటర్ కె.ఎ.పి.పి చంద్ర కోరిక మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు 37వ డివిజన్ లక్ష్మీనగర్ లోని రెండు వీధుల్లో మరియు ప్రధాన రోడ్లపై మురికినీరు నిలిచిపో యింది. దీనివల్ల తీవ్ర దుర్వాసన రావడంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రజల బాధలను గమనించిన స్థానిక కార్పొరేటర్ కె.ఎ.పి.పి చంద్ర వెంటనే డిప్యూటీ మేయర్ సునీల్ రావు దృష్టికి తీసుకెళ్లారు.కార్పొరేటర్ విజ్ఞప్తి మేరకు డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆ ప్రాంతానికి చేరుకొని సమస్యను స్వయంగా పరిశీలించారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాలను చూసిన అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు.ఈ మురికినీటి సమస్యకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేటర్ కు పలు సూచనలు చేశారు. డిప్యూటీ మేయర్ సూచించిన పనులు చేపడితే సమస్య పూర్తిగా తొలగిపోతుందని, ప్రజలకు ఈ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.డిప్యూటీ మేయర్ సూచనల మేరకు సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ కె.ఎ.పి.పి చంద్ర హామీ ఇచ్చారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్ చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్
వెల్దుర్తి  (మెదక్ జిల్లా):   వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
పుర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి 
చేనేత సహకార సంఘ అధ్యక్షురాలికి సన్మానం
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులు
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష