నాగర్‌కర్నూల్ జిల్లాలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో భారీ మోసం
నాగర్‌కర్నూల్ : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.ఇంటి నుంచే పని చేస్తూ మంచి ఆదాయం వస్తుందనే ఆశ చూపి,లక్షల్లో పెట్టుబడులు రాబట్టిన ఓ సంస్థ ఆగస్టు నెలలో ఒక్కసారిగా కార్యకలాపాలు నిలిపివేయడంతో 20నుంచి30 మంది వరకు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎలా జరిగింది మోసం:
బాధితుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన ఓ వ్యక్తి నాగర్‌కర్నూల్ జిల్లాలో రూ.లక్ష పెట్టుబడి పథకం పేరుతో ప్రచారం చేశారు.తొలుత నమ్మకం కలిగేలా బాధితులకు ఇంటికి మెటీరియల్ అందించి,ప్రతినెలా జీతాలు కూడా సకాలంలో చెల్లించారు.దీంతో మరిన్ని కుటుంబాలు ఈ పథకంలో చేరాయి.అయితే ఈ నెల ఆగస్టులో అకస్మాత్తుగా జీతాలు,మెటీరియల్ సరఫరా రెండూ నిలిపివేశారు.బాధితులు నిలదీయగా "సంస్థను ఎత్తేశాం" అని నిర్వాహకులు సమాధానం ఇచ్చారని బాధితులు తెలిపారు.
లక్షల్లో నష్టం:
పెట్టుబడిగా లక్షల రూపాయలు పెట్టిన బాధితులు ఇప్పుడు అసలు,జీతాలు రెండింటికీ ఎదురుచూస్తున్నారు.చాలా మంది అప్పులు చేసి ఈ పథకంలో డబ్బు పెట్టినట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు:
మోసపోయామని గ్రహించిన నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బును రాబట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విజయవాడకు చెందిన ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్,పెట్టుబడి పథకాల పేరుతో వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.ముందుగా పెద్ద మొత్తంలో డబ్బు అడిగే ఏ పథకానికైనా సరైన ధృవీకరణలు లేకుండా నమ్మవద్దని హెచ్చరించారు.మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
