గురుపౌర్ణమి సందర్భంగా గజ్వేల్‌లో అర్చకులు, ఆధ్యాత్మిక వేత్తలకు ఘన సన్మానం
గజ్వేల్: పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరియు గజ్వేల్ హౌసింగ్ బోర్డు కాలనీ సాయిబాబా దేవాలయంలో బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా కన్వీనర్ కాషామైన సందీప్ కుమార్ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం చేయడం జరిగింది. శ్రీ మంకాలమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు నంద బాల శర్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసచార్యులు, శ్రీ సంతోషిమాత దేవాలయ ప్రధాన అర్చకులు రాజశేఖర శర్మ, గజ్వేల్ పెద్దలు సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్ బాబు ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తూ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్న గురువులు, అర్చకుల పాత్ర అపారమైనదని కొనియాడారు. సాంస్కృతిక, ధార్మిక విలువలను కాపాడుకోవడంలో వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బిజెపి ఎండోమెంట్ (ధార్మిక )సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ దేవి ప్రసాద్, బిజెపి ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, బిజెపి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్యాల వెంకట్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిజెపి ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ గుప్తా, యేడెల్లి శ్రీను దేవులపల్లి రాజారాం, కొండమీది మల్లేశం, బిజెపి నాయకులు అత్వెల్లి రవీందర్, సంగుపల్లి రవీందర్, గడియారం రాజేశ్వర్ చారి, పద్మశాలి సంఘం కోశాధికారి హనుమాన్ దాస్, తదితరులు పాల్గొన్నారు.
Views: 55
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
