ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలను తగ్గించండి
నిజామాబాద్ : నిజామాబాద్ మంగళవారం రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల లోపు మరణాల పై సమీక్షను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీమతి బి రాజశ్రీ గారి ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జ్ ను పెంచుకుంటూ వైద్య సేవలను అందించాలని. గర్భిణీ స్త్రీల లో మరియు చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను క్రమం తప్పకుండా వారి ఇంటి వద్ద ఫాలో అప్ చేయాలని అన్నారు. సిపిఆర్ పట్ల అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి గర్భిణీ స్త్రీని,ప్రతి బాలింతని ఫాలోఅప్ విజిట్స్ లో తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలన్నారు. వేరే ప్రాంతాల నుండి తల్లి గారి ఇంటికి వచ్చిన మన వద్ద నుండి వేరే ప్రాంతానికి వెళ్లిన మదర్ ఇన్, మదర్ ఔటు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నారు తద్వారా ఫాలోఅప్ సక్రమంగా నిర్వహించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని అన్నారు. గర్భిణీ స్త్రీలు కళ్ళు తాగే అలవాటును మాన్పించాలని, మూఢనమ్మకాలను తొలగించాలని తెలియజేశారు, ఎం సి హెచ్ కార్డును తూచా తప్పకుండా అనుసరించినట్లయితే ఫలితాలు ఉంటాయన్నారు. ప్రధమ చికిత్స కిట్టును ఎమర్జెన్సీ కిట్టును అందరివద్దా అందుబాటులో ఉండాలని, బిడ్డకు బిడ్డకు మధ్య వ్యత్యాసం పాటించేలా అవగాహన కలిగించాలని శాశ్వత మరియు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కౌన్సిలింగ్ చేసి అంతరా ,ఐయుడి పిపీఐయుసిడి ,వాడేలా చూడాలన్నారు. అంతిమంగా మన చేతిలో ఉండి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా కాపాడదగ్గ ప్రాణాలు అన్నిటిని కాపాడే బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు పోచంపాడు, నందిపేట్ ,రెంజల్, బినోల సిఎస్ కాలనీ, రుద్రూర్, జక్రంపల్లి ,ముదక్పల్లి వేల్పూర్ ,మోస్ర 10 పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు,ఆశాలను సమీక్షించడం జరిగింది. ప్రతి నెల గర్భిణీ స్త్రీలను పరీక్షించడం, కౌన్సిలింగ్ చేయడం ప్రమాదకర లక్షణ కలవారిని, ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరగాలన్నారు. రక్తహీనత, బిడ్డకు బిడ్డకు మధ్య మూడు సంవత్సరాలు విరామం ఉండాలని దీనికోసం కుటుంబా నియంత్రణ తాత్కాలిక పద్ధతులు అయినా ఐయూసీడీ, అంతర ఇంజక్షన్, పీపీ ఐ యు సి డి ఉపయోగించ లన్నారు , లేదా శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. అందుకోసం రెండు సంవత్సరాల డెలివరీ రికార్డు ఆధారంగా జాబితాను తయారు చేసి వారికి అవగాహన మరియు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మొదలగు శాఖల సహకారం తీసుకోనీ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు.ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలను ప్రతినెల 10 లోపు ఆడిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై, ప్రసవానంతరం గంటలోపు మొర్రిపాల ప్రాముఖ్యతపై వివరించాలన్నారు. గర్భిణీ స్త్రీ బరువు పెరుగుదలను ప్రతినెలా సమీక్షించాలన్నారు. ప్రసవానంతరం ఏడవ నెల తర్వాత శిశువులకు అనుబంధ ఆహారంపై బాలింతలకు అవగాహన కలిగించాలని అన్నారు. స్త్రీ వైద్య నిపుణులు , మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సీబీపీ, హిమగ్లోబిన్ ,బిపి రికార్డు ,హైట్, వెయిట్ను పరీక్షించాలని కనీసం నాలుగు సార్లు వైద్యని చేత పరీక్షించాలన్నారు. ప్రమాదకర లక్షణాల గర్భిణీ గుర్తింపు, తల్లిపాల ప్రాముఖ్యత, బరువు పెరుగుదల పై సమీక్ష, తాత్కాలిక పద్ధతులను ఉపయోగించడం, అంబులెన్స్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చి ఉపయోగించడం, శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించాలీ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్ ఎం అశోక్ , స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అరుణ రేఖ, , పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ ,డాక్టర్ సుస్మిత, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లు డాక్టర్ రవీందర్, డాక్టర్ , డాక్టర్ విద్య, డాక్టర్ సికందర్ నాయక్ , డీఎస్ఓ డాక్టర్ వెంకటేష్ డా నవ్య సిడిపిఓలు , రాంబాబు, డి హెచ్ ఈ లు గన్పూర్ వెంకటేశ్వర్లు,మనోహర్ డిడిఎం పృద్వి,వివిధ పీహెచ్ సి ల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


