సాయినామ స్మరణతో మార్మోగిన మర్పల్లి షిరిడి సాయిబాబా ఆలయం

సాయినామ స్మరణతో మార్మోగిన  మర్పల్లి షిరిడి సాయిబాబా ఆలయం

  • ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. ఘనంగా అన్నదాన కార్యక్రమం
  • సాయిబాబా సన్నిధిలో భక్తుల ఆధ్యాత్మిక సందడి
 

మర్పల్లి, (వికారాబాద్ జిల్లా): మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం లో  బుధవారం గురుపౌర్ణిమ పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.ఉదయం నుంచే శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురుపౌర్ణిమ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల మధ్య సాయిబాబాకు పాలాభిషేకం, పంచామృ తాభిషేకం, అర్చనలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం సాయిబాబాకు మహా మంగళహారతి సమర్పించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిపారవశ్యంలో ప్రార్థనలు చేశారు. ఆలియా ప్రాంగణంలో మహిళా భక్తులు కోలాటలాడుతూ నృత్యం చేస్తూ సాయిబాబాను స్మరించుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం శ్రీ సాయి సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు క్రమపద్ధతిలో అన్నప్రసాదాన్ని స్వీకరించి సాయిబాబా ఆశీస్సులు పొందారు. గురుపౌర్ణిమ సందర్భంగా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం రోజు పొడవునా సందడిగా మారింది.ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సేవా సమితి సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గురుపూజా మహోత్సవాన్ని విజయవంతం చేశారు. గురుపౌర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. 
Views: 124

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత