హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న

ప్రధాన వంటశాలను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు  పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న

హన్మకొండ :  పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలలో అత్యున్నత పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో ఉన్న హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలను, అనంతరం నూతనంగా నిర్మించిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల నిర్వహణ, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్యాకింగ్ తదితర అంశాలపై నిర్వాహకులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.వంటశాల పరిసరాలు, బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నిల్వ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ఆహార పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయాలని సూచించారు. వంట తయారీలో పాల్గొనే సిబ్బంది శుభ్రమైన దుస్తులు, గ్లౌజులు, హెడ్ క్యాప్‌లు తప్పనిసరిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందించే భోజనం నాణ్యతతో పాటు రుచికరంగా, పరిశుభ్రంగా, వేడిగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఆహార తయారీ నుంచి ప్యాకింగ్, పంపిణీ వరకు ప్రతి దశలో పరిశుభ్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వంటశాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని, పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్రతకు తావులేకుండా చూడాలని ఆదేశించారు.ఈ సందర్భంగా వంటశాల నిర్వాహకులు డ్రెయిన్ ఔట్‌ఫ్లో సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కచ్చా డ్రెయిన్ ఏర్పాటు చేసి నీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.ఐడీఓసీ పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అనంతరం నూతనంగా నిర్మించిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని కమిషనర్ టి. వెంకన్న సందర్శించారు. కలెక్టరేట్ ఆవరణలో కొనసాగుతున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించి, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పరిసరాలతో పాటు అప్రోచ్ రోడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు సూచించారు.ప్రజలు, అధికారులు నిత్యం సందర్శించే సమీకృత కలెక్టరేట్ ప్రాంగణం పరిశుభ్రత, పచ్చదనం, పారిశుధ్యానికి ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ డా. రాజేష్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, ఇంజనీరింగ్ అధికారులు, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ