తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం ఇంద్రవెల్లి మండల కమిటీ ఎన్నికలు

తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం ఇంద్రవెల్లి మండల కమిటీ ఎన్నికలు

ఉట్నూర్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ,ఆదివాసీ విద్యార్థి సంఘం ఇంద్రవెల్లి మండల కమిటీ ఎన్నికలను ఆగస్టు 16న నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదిరావు తెలిపారు. ఆదివాసీ హక్కులు, జల్–జంగల్–జమీన్ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న తుడుందెబ్బ మరియు ఆదివాసీ విద్యార్థి సంఘాల ఇంద్రవెల్లి మండల కమిటీ ఎన్నికలను ఆదివారం రోజున ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రగల్ జెండా భవన్ వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివాసీ సమాజానికి నిరంతరం నిస్వార్థంగా సేవ చేయాలనే ఆసక్తి, అంకితభావం ఉన్న ఆదివాసీ యువత, నాయకులు ఈ మండల కమిటీ ఎన్నికల్లో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ నాయకులు పూర్క బాపురావు, సలాం శ్యాంరావ్, పెందోర్ మోతిరం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులు, రాయి సెంటర్ సర్మేడీలు, రాజకీయ నాయకులు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ యువత, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మండల కమిటీ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ