దొంతి బస్టాప్ వద్ద శిథిలావస్థలో మినీ ట్యాంక్ బోరు
రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు వినతి
శివంపేట, (మెదక్): దొంతి గ్రామంలోని బస్టాప్ వద్ద శిథిలావస్థలో ఉన్న మినీ ట్యాంక్ బోరు బావిని వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని 10వ వార్డు సభ్యురాలు బుద్ధుల మమత, బుద్ధుల బిక్షపతి కోరారు. ఈ విషయాన్ని డీఎల్‌పీఓ సురేష్ బాబు, ఎంపీఓ తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, బోరు బావి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని దొంతి గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్ గౌడ్‌కు సూచించారు. బస్టాప్ వద్ద ఉన్న ఈ మినీ ట్యాంక్ బోరును త్వరితగతిన రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బుద్ధుల బిక్షపతి తెలిపారు. అధికారులు త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:31:41
వెల్దుర్తి (మెదక్ జిల్లా): వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
