తిమ్మాజీపేట వెటర్నరీ ఆసుపత్రీ నీ ఆకస్మిక తనిఖీచేసిన : కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్
నాగర్‌కర్నూల్, / తిమ్మాజీపేట : రైతులకు సకాలంలో పశువైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ తిమ్మాజీపేట ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో పశువులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.అందుబాటులో ఉన్న మందులు,వైద్య పరికరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువులకు ఏమైనా వ్యాధులు సోకితే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలని సూచించారు. పశువులకు టీకాలు,వైద్య పరీక్షలు నిర్ణీత సమయంలో అందేలా చూడాలన్నారు.పశువుల ఆరోగ్య పరిరక్షణపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.పశువుల యాజమాన్యుల ఆధార్,పశువుల వివరాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.గ్రామాల వారీగా పశువులు, రైతుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పాడి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును నమోదు చేసి సకాలంలో చికిత్స అందించాలని తెలిపారు.రైతులకు పశుసంవర్ధక శాఖ పథకాలు,టీకాలు ,పశుపోషణపై అవగాహన కల్పించాలని కోరారు. పశువైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని,పశుసంపద పరిరక్షణతో పాటు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:31:41
వెల్దుర్తి (మెదక్ జిల్లా): వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
