బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
విద్యార్థుల తో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ మండల పరిధిలోని బొర్లం గ్రామంలోని టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జూనియర్ కళాశాల( బాలికల) ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి, డి సి ఓ, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, ఆర్ ఐ, జిపిఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, తదితర అధికారులు పాల్గొన్నారు.
తరగతి గదులు, రికార్డుల పరిశీలన...
కళాశాలకు చేరుకున్న కలెక్టర్ ఎస్పీ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి చదువులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ బోర్డుపై రాసిన పాటలను ఇస్కూల్ రిపోర్టుల ను టోపీల ను కూడా పరిశీలించారు. అధ్యాపకుల తో బోధన పద్ధతులపై చర్చించారు.
విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు.....
అనంతరం కలెక్టర్, ఎస్పీ విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు. భోజనం లో నీ నాణ్యత ప్రమాణాలను, మెనూ పరిశుభ్రత గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా చదువుకోవాలని క్రమశిక్షణతో సమాజంలో ముందుకు సాగాలని వారు సూచించారు. కళాశాల ప్రాంగణాలను కలెక్టర్ పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పన పై అమృత అధికారులకు పాలు సూచనలు చేశారు. విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించేందు కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ సందర్శన తో గురుకుల హాస్టల్ విద్యార్థులు, అధ్యాపకుల లో ఆనందం వెలివేరిసింది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


