చౌటకూర్‌లో విరబూసిన అరుదైన బ్రహ్మకమలం
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని గోపి గౌడ్ ఇంట్లో మంగళవారం రాత్రి అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. తమ ఇంటి మొక్కకు బ్రహ్మకమలం పూయడం ఎంతో ఆనందంగా ఉందని గోపి గౌడ్ తెలిపారు.ఆషాఢ మాసంలో బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పుష్పానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మ చిత్రపటం వద్ద మంగళహారతి సమర్పించి పుష్పాన్ని దర్శించుకున్నారు. బ్రహ్మకమలం వికసించిన విషయం తెలుసుకున్న స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
Views: 94
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
