శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ
మెదక్ జిల్లా / వెల్దుర్తి : వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో గ్రామ సమస్యలపై, అభివృద్ధి పనుల గురించి ప్రజలతో మాట్లాడేందుకు శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పెద్దలు యువకులు అందరూ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంజ లావణ్య రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని, గ్రామం లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని గ్రామ అభివృద్ధికి అందరి సహకారం కావాలని కోరారు. గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తుల నవీన్ , వార్డు సభ్యులు బండ నాగరాజు గోగుల యాదగిరి, అంగన్వాడి టీచర్ దేవలత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రణీద్ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:31:41
వెల్దుర్తి (మెదక్ జిల్లా): వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
