ప్రసవం కోసం వస్తే ప్రాణమే పోయింది..
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ అనిత మృతి, బంధువుల ఆగ్రహం
సంగారెడ్డి : ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యమే తమ కూతురు చావుకు కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.చౌటకూర్ మండలం బద్రి గూడెం గ్రామానికి చెందిన అనిత( 33) సంవత్సరాలు భర్త శ్రీశైలం,9 నెలల గర్భిణీ అయిన ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 10వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో అనితకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి మృతి చెందిందని వైద్యులు తెలుపుతున్నారు. అనిత మృతి వార్త తెలియడంతో ఆగ్రహించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. సమయానికి సరైన వైద్యం అందించలేదు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే అనిత ప్రాణాలు కోల్పోయింది అని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత డాక్టర్లు మరియు వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సంగారెడ్డి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న బంధువులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం ఉంచి పేద రోగులు వస్తే వైద్యులు సరైన చికిత్స నిర్వహించగా పోవడంతో పేద ప్రజలు మృతి చెందుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Views: 383
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
