సింగూరు గురుకులం, పుల్కల్ కేజీబీవీల్లో ఆహార భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీలు
చౌటకూర్ :- పుల్కల్ మండల పరిధిలోని సింగూరులోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్/కళాశాల, పుల్కల్లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ ఆహార భద్రత తనిఖీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆహార భద్రత అధికారులు ఆయా వసతి గృహలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార మెను సక్రమంగా నిర్వహించడం లేదని, ఫుడ్ టెస్టింగ్ రికార్డుల నిర్వహణలో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండి పడ్డారు. ఆయా వసతి గృహాల్లో ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నిర్వహణ విధానాలను ఆహార భద్రత అధికారులు పరిశీలించారు.టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్/జూనియర్ కళాశాలలో తీవ్ర లోపాలు టీజీఎస్ఈబ్ల్యూఆర్ఎస్/జూనియర్ కళాశాలలో ఈ సందర్భంగా పలు లోపాలున్నట్లు గుర్తించారు. వంటశాల గదులు పాచిపోయి ఉండటంతో పాటు నీరు నిల్వ ఉండటాన్ని గమనించి నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, నిల్వ ఉంచిన సరుకుల్లో పురుగులు, నల్లని కీటకాలు ఉన్నట్లు తేలింది. వంటశాలల్లో పరిశుభ్రత పాటించడం లేదని, కిటికీలకు రక్షణ మెష్లు ఏర్పాటు చేయలేదని పరిశీలనలో తేలింది. ప్రాంగణంలో ఈగలు అధికంగా సంచరిస్తూ ఉం డటాన్ని గమనించారు. దీనివల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త కామన్ డైట్/ఆహార మెనూ ప్రదర్శించబడినప్పటికీ, దానిని సక్రమంగా అమలు చేయడం లేదు. వడ్డించే ముందు వేడిగా వండిన ఆహారం రుచి, తినడానికి అనుకూలత, నాణ్యత ఉన్నది లేనిది సిబ్బంది, కేర్జేకర్ రుచి చూసి నిర్ధారించాల్సి ఉండగా, అవేమి అక్కడ కనిపించలేదు. ఇందుకు సంబంధించిన ఫుడ్ టెస్టింగ్ రికార్డుల నిర్వహణ కూడా సక్రమం గా పోవడం పట్ల ఆగ్రహంఆగ్రహం చెందారు. పుల్కల్ కస్తూర్భా గాంధీలో…
పుల్కల్లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా వండిన ఆహారం ముందుగా రుచి, తినడానికి అనుకూలత, నాణ్యతను పరిశీలించే విధానం సక్రమంగా పాటించడం లేదంటూ సంబంధి ఎస్ఓ ఇందిరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారాన్ని నిర్వహణ బాధ్యలు చూస్తున్న సిబ్బందికి సంబంధించిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు పరిశీలనకు అందుబాటులో లేవని నిర్ధారించారు. తాగునీరు, ఆహార తయారీకి ఉపయోగించే నీటిని నిర్దిష్ట కాల వ్యవధిలో పరీక్షించడం లేదని, సంబంధిత నీటి పరీక్ష రికార్డులు కూడా అందుబాటులో లేవని గుర్తించారు. ఈ లో పాలను తక్షణమే సరిదిద్ది.ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పురుగుల నియంత్రణ, ఆహార పదార్థాల సురక్షిత నిల్వ, ఆహార నిర్వహణ సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణ, నీటి నాణ్యతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులకు అందజేసే ఆహారం విషయంలో విద్యా సంస్థల్లో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్ది, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశిం చారు. ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోబడతాయని ఆహార భద్రత అధికారులు పేర్కొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
