సగర్వంగా హర్ ఘర్ తిరంగా: మల్యాలలో ఘనంగా పాదయాత్ర, కొండగట్టు వరకు బైక్ ర్యాలీ
మల్యాల, : మల్యాల మండల కేంద్రంలో బుధవారం బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో మల్యాల మండల కేంద్రంలో 'హర్ ఘర్ తిరంగా' పాదయాత్ర మరియు భారీ బైక్ ర్యాలీ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయ వంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బిజెపి నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీ సాయిని మల్లేశం ముఖ్య అతిథిగా హాజర య్యారు. మల్యాల బ్లాక్ చౌరస్తా వద్ద ప్రారంభమైన ఈ తిరంగా యాత్ర అంగడి బజార్ వరకు వైభవంగా కొనసాగింది. అనంతరం బ్లాక్ చౌరస్తా నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు చేతిలో జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలతో మల్యాల వీధులను హోరెత్తించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. "మన జెండా మన గౌరవం. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి, ప్రతి హృదయంలో దేశభక్తి భావనను పెంపొందించడమే ఈ 'హర్ ఘర్ తిరంగా' యాత్ర ముఖ్య ఉద్దేశం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, గుజ్జు శ్రీనివాస్, వన్ హాస్పిటల్ అధినేత మరి మహేష్ రెడ్డి, మండల సర్పంచులు బోట్ల జయప్రద, సంకుర్తి తిరుపతి, గడ్డం నడి మల్లేశం, చీకటి లత, వక్కలభరణ మౌర్య, ప్రధాన కార్యదర్శులు పొన్నం సాయికుమార్ , పిల్లి రాజశేఖర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు గౌతమ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సామ మైపాల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పరమేష్, ఉప సర్పంచులు మల్లేశం యాదవ్, వినోద్, శంకర్, అలాగే బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు, వివిధ రంగాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 18:14:19
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
