అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
శివంపేట, (మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముకుల గ్రామానికి చెందిన నారాయణ గారి పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా స్పందించి, మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ గుప్తా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తనవంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

