గ్రామసభల నిధులు కార్యదర్శులకు చెల్లించాలి

బిఆర్ఎస్ మాజీ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి

గ్రామసభల నిధులు కార్యదర్శులకు చెల్లించాలి

మంగపేట,:గ్రామసభల నిధులు కార్యదర్శులకు చెల్లించాలి అని బిఆర్ఎస్ మాజీ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మంగపేట మండలంలోని 25 గ్రామపంచాయతిల్లో కార్యదర్శులు ​గత మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పంచాయతీలో రెండుసార్లు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి ₹10,000 చొప్పున కేటాయించింది. ఈ లెక్కన మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు కలిపి మొత్తం ₹2,50,000 (రెండు లక్షల ఏభై వేల రూపాయలు) మంజూరయ్యాయి.​ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ నిధులను పంచాయతీ కార్యదర్శులకు అందజేయకుండా మండల స్థాయికి చెందిన ఒక అధికారి తన వద్దే భద్రంగా ఉంచుకున్నట్లు శాఖాపరంగా ప్రచారం జరుగుతోంది. కావున ప్రభుత్వం నుండి వచ్చిన అనిధులని ప్రతి పంచాయతీ కార్యదర్శి కి అందేలా జిల్లా పంచాయతీ అధికారి,జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి అని శ్రీహరి అన్నారు. ​గ్రామసభలకు సంబంధించిన నిధులు తమకు ఇప్పటివరకు అందలేదని, తాము ఎటువంటి వోచర్లపై కూడా సంతకాలు చేయలేదని పలువురు కార్యదర్శులు తెలిపారు అని ఆయన అన్నారు.మంగపేట మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అధికారుల వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఆలస్యంగా వచ్చే వేతనాలు, చిన్న చిన్న పనులకు సొంత జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే, మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఉన్నత స్థాయి అధికారులు మింగుతుంటే ఎలా అని విమర్శించారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత