మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎర్ర సత్యం గారి వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎర్ర సత్యం గారు “పేదోళ్ల పెద్ద బిడ్డ”గా, ప్రజల మనిషిగా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. పాలమూరు ప్రాంత అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు, చూపిన చొరవ నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని అన్నారు.ఎర్ర సత్యం గారు చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎర్ర సత్యం గారి అభిమానులు, యువకులు, నాయకులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
Views: 119
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:40:04
శివ్వంపేట (మెదక్): శివంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్ల ZPHS పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే...
