జలసిరిలో భాగంగా ఫారం పాండ్ నిర్మాణం.. రైతు అంజయ్యకు అభినందనలు
ఫారం పాండ్‌ను పరిశీలించిన ఎంపీడీవో కే. శంకర్, డీఎల్‌పీవో అనిత
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని పోసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతు అంజయ్య నిర్మించుకున్న ఫారం పాండ్‌ను బుధవారం ఎంపీడీవో కే. శంకర్, డీఎల్‌పీవో అనిత పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్‌ను నిర్మించుకున్న రైతు అంజయ్యను అధికారులు ఈ సందర్భంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందిం చేందుకు ఫారం పాండ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు తమ పొలాల్లో ఫారం పాండ్లను నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు, అవసరమైన సమయంలో వ్యవసాయానికి వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఫారం పాండ్ల వల్ల భూగర్భ జలమట్టాలు పెరిగి, సాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందని వివరించారు. రైతు అంజయ్యను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని ఇతర రైతులు కూడా ఫారం పాండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని సూచించారు. వీటిలో నీటిని నిల్వ చేసుకోవడమే కాకుండా చేపల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సువర్ణ, ఏపీవో రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి అశోక్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 49
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 18:14:19
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
