ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు హర్షణీయం.

బాన్సువాడ నియోజకవర్గ గౌడ సోదరులు.

ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు హర్షణీయం.

కామారెడ్డి, బాన్సువాడ : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల సోమవారం బాన్సువాడ నియోజకవర్గం గౌడ సోదరులు హర్ష్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ. పాపన్న గౌడ్ 366 జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు18వ తేదీ న సాయంత్రం 4గంటలకు ఆవిష్కరించనున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో గౌడ కులస్తుల కు సరైన గౌరవం దక్కిందనడాని కి ఇదే నిదర్శనమన్నారు. ప్రజా ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు మాట ఇచ్చి తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి పక్కన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాని కి గౌడ సోదరులు ఎల్లపుడు రుణపడి ఉంటారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యం లో ప్రజా ప్రభుత్వం పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు,టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీకి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ కు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, బీసీ, సంఘాల గౌడ సంఘాల ప్రజా ప్రతినిధుల కు ధన్యవాదాలు తెలుపు తున్నామన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పెద్ద సంఖ్యలో జిల్లాలోని గౌడ సోదరు లందరూ హైదరాబాద్ కు భారీ సంఖ్యలో తరలి వెళ్లి  విజయం చేయాలని గౌడ సోదరులు కోరారు.
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News