ప్రజావాణికి ఐదు శాఖల అధికారులే హాజరు.

మిగతా వారి గైర్హాజరుపై ఎంపీడీవో ఆవేదన

ప్రజావాణికి ఐదు శాఖల అధికారులే హాజరు.

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఐదు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ప్రజల సమస్యలను స్వీకరించి, పరిష్కరించేందుకు నిర్వహించే ఈ ముఖ్యమైన కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా సమయానికి హాజరు కావాలని ముందస్తుగానే చరవాణి (ఫోన్) ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఉదయం 10:30 గంటలు దాటినా పలు శాఖల అధికారులు రాలేదు.సమయానికి ఎంపీడీవో ,ఎక్సైజ్, వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ శాఖలతో పాటు ఎస్సీ హాస్టల్‌కు చెందిన అధికారులు, ఎంపీడీవో మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.ప్రజావాణికి అధికారులు కచ్చితంగా సమయపాలన పాటించాలని ఎంపీడీవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News