పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం

పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం

​మల్యాల, : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం నగదు బహుమతులను అందజేశారు. ​గ్రామ ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిభ చూపిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,000 చొప్పున మొత్తం ₹11,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు.​ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూవిద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి, వార్డు సభ్యుడు పంజాల రమేష్, అనితతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News